- Advertisement -
ఏడేండ్ల తర్వాత ఇదే తొలిసారి
కారకాస్ : వెనిజులాలో యూఎస్ రాయబార కార్యాలయంపై అమెరికా జాతీయ పతాకాన్ని ఎగరేశారు. 2019 తర్వాత…అంటే ఏడు సంవత్సరాల తర్వాత అమెరికా ఎంబసీపై మొదటిసారిగా ఆ దేశ జాతీయ పతాకం ఎగిరింది. ప్రస్తుతం ఈ భవనానికి మరమ్మతులు చేస్తున్నారు. దీనిని పూర్తి స్థాయిలో ఎప్పుడు తెరిచేదీ ఇంకా తెలియడం లేదు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగుజ్‌కు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. జాతీయ పతాకాన్ని ఏడు సంవత్సరాల తర్వాత ఎగరేశామని ఎంబసీలోని అమెరికా బృందం తెలిపింది.
- Advertisement -



