- Advertisement -
ఎనిమిది మంది మృతి..నలుగురు గల్లంతు
చైనా: చైనాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో కనీసం ఎనిమిది మంది మరణించారని ఆ దేశ వార్తా సంస్థ జిన్హువా ఆదివారం నివేదించింది. ఈ వరదల్లో మరో నలుగురు గల్లంతు కాగా, వారిని వెతుకులాట కొనసాగిస్తున్నారు. ఇన్నర్ మంగోలియా ఉత్తర ప్రాంతంలో శనివారం (ఆగస్టు 16) రాత్రి 10 గంటల ప్రాంతంలో వరద సంభవించిందని, క్యాం పింగ్ ట్రిప్‌లో ఉన్న 13 మంది కొట్టుకు పోయారని, ఒకరిని రక్షించారని నివేదిక తెలిపింది. గల్లంతు అయిన వారి కోసం అన్వేషణ, రక్షణ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని జిన్హువా తెలిపింది
- Advertisement -