Thursday, October 2, 2025
E-PAPER
Homeజాతీయంఉత్తరాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం

ఉత్తరాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వంశ ధార, నాగావళి నదులకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ అయ్యింది. 20 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

కళింగపట్నం సమీపంగా తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయువ్య దిశగా కదులుతూ అర్ధరాత్రి పారాదీప్‌-గోపాల్‌పూర్‌ మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 70 కి.మీ పైబడిన వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరక కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్ర వాయుగుండంతో ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అలజడిగా మారింది. వాతావరణ శాఖ.. మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. విశాఖలో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. గాలి వానకు భారీ చెట్లు నేలకొరిగాయి.

పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్‌ కుప్పకూలాయి. ద్వారకానగర్ రోడ్డులోని ఫార్చునర్ కారుపై చెట్టు కూలిపోయింది. కారు పార్క్ చేసి.. ఓనర్ షాపింగ్‌కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఎక్కడికక్కడ భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఏయూ, శంకరమఠం, సత్యం జంక్షన్‌, బీవీకే కాలేజీ రోడ్లలో చెట్లు విరిగిపడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -