– ఆ బ్యాంక్ మాజీ చైర్మెన్ చక్రవర్తి
ముంబయి : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కార్యకలాపాల్లో లోపాలు జరిగాయని ఆ బ్యాంక్ మాజీ చైర్మెన్ అతన్ చక్రవర్తి వెల్లడించారు. ప్రయివేటు బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ (పరిపాలన), నైతిక విలువల కంటే కేవలం వ్యాపార వృద్ధి, లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే కోణంలో ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దుబారు కార్యకలాపాల్లో 2018 నుంచి జరిగిన కస్టమర్‌లను చేర్చుకోవడంలో లోపాలు, ఏటీ1 బాండ్ల విక్రయంలో జరిగిన అవకతవకలను ఆయన ప్రధానంగా ఎత్తి చూపారు. ఈ లోపాలను మేనేజ్‌మెంట్ కేవలం సాంకేతిక కారణాలుగా కొట్టిపారేయడాన్ని చక్రవర్తి తప్పుబట్టారు. ఇవి కేవలం డాక్యుమెంటేషన్ లోపాలు కావని, బ్యాంకు నైతిక విలువలు, పని సంస్కృతికి సంబంధించిన లోతైన సమస్యలని ఆయన స్పష్టం చేశారు. తప్పులు జరిగిన వెంటనే స్పందించకుండా సమస్యలు ముదిరిన తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల బ్యాంకు పట్ల ప్రజలకు ఉండే నమ్మకం దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక స్వతంత్ర డైరెక్టర్‌గా తన బాధ్యత కేవలం లాభనష్టాలను చూడటమే కాదని, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడుతూ పారదర్శకతను నిలబెట్టడమని చక్రవర్తి పేర్కొన్నారు. బోర్డు స్థాయి నిర్ణయాల్లో పారదర్శకత లోపించడం, జవాబుదారీతనంలో ఆలస్యం వంటి అంశాలు వ్యవస్థాగత వైఫల్యాలకు దారితీస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
హెచ్‌డీఎఫ్‌సీ విదేశీ కార్యకలాపాల్లో లోపాలు
- Advertisement -
- Advertisement -



