Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఫ్లిప్‌కార్ట్‌-ఎస్బీఐ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు విడుదల

ఫ్లిప్‌కార్ట్‌-ఎస్బీఐ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు విడుదల

- Advertisement -

హైదరాబాద్‌ : ఎస్బీఐ కార్డ్‌, ఇ కామర్స్‌ వేదిక ఫ్లిప్‌కార్ట్‌ సంయుక్తంగా ‘ఫ్లిప్‌కార్ట్‌ ఎస్బీఐ క్రెడిట్‌ కార్డ్‌’ను విడుదల చేశాయి. ఈ కార్డుతో ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, షాప్సీ, క్లియర్‌ట్రిప్‌లో అనేక ఆఫర్లను, క్యాష్‌బ్యాక్‌లను పొందవచ్చని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కార్డుతో చేసే వ్యయాల ద్వారా మింత్రాలో 7.5 శాతం, ఫ్లిప్‌కార్ట్‌, షాప్సీ, క్లియర్‌ట్రిప్‌లో 5 శాతం చొప్పున క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చని ఎస్బీఐ కార్డు పేర్కొంది. ”ఈ కార్డు ఇ-కామర్స్‌ వినియోగదారులకు సీమ్‌లెస్‌, రివార్డింగ్‌ అనుభవాన్ని అందిస్తుందని ఎస్బీఐ కార్డ్‌ సీఈఓ సలీల పాండే పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాలకు విలువను అందిస్తుందని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad