రెండ్రోజుల్లో 321 మంది మృతి
లాహౌర్: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తు న్నాయి. ఈ ఆకస్మిక వరదల కారణంగా రెండ్రోజుల్లోనే 321 మంది మరణించినట్టు అధికా రులు వెల్లడించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోనే 307 మంది చనిపోయినట్టు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లోయర్ దిర్, బజౌర్, అబోటాబాద్, జబ్రారీతో సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడ టంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. వరదల కారణంగా పదుల సంఖ్యలో భవనాలు, పాఠశాలలు దెబ్బ తిన్నాయి. పలు వంతెనలు కూడా కొట్టుకుపో యాయి.
అనేక రహదా రులు జలదిగ్బంధ మయ్యాయి. వరదల్లో అనేక మంది గల్లంతైనట్టు అధికారులు వెల్లడిం చారు. వీరికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు దాదాపు 2వేల మందితో ఆపరేషన్ కొన సాగుతున్నట్టు అధికారులు వెల్లడిం చారు. మరోవైపు పాక్‌లోని మరిన్ని ప్రాంతా లకు భారీ వర్ష ముప్పు పొంచి ఉన్నట్టు స్థానిక వాతా వరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
పాకిస్తాన్‌లో వరద బీభత్సం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES