– 51కి చేరిన మృతుల సంఖ్య
టెక్సాస్: అమెరికా టెక్సాస్‌లో వరద ప్రమాదంలో మరణాల సంఖ్య 51కి చేరింది. వేసవి శిబిరానికి వచ్చిన 15 మంది చిన్నారులు మరణించగా, మరో 27 మంది బాలికలు గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
గత కొన్ని రోజలుగా కురుస్తున్న వర్షాలకు కెర్ కౌంటీలో గ్వాడాలుపే నది ఉప్పొంగడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో నదీ తీరంలో ఉన్న శిక్షణాశిబిరాలను వరదనీరు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అనేక నివాసాలు నీట మునిగి వీధుల్లోకి భారీగా వరద నీరు చేరింది. పలు వాహనాలు కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 850 మందిని రక్షించినట్టు అక్కడి అధికారులు తెలిపారు.
మరోవైపు కెర్ కౌంటీలోని గ్వాడలూప్ నది ఉప్పొంగి సమీపంలోని మిస్టిక్ క్యాంప్ వేసవి శిక్షణా శిబిరాన్ని ముంచెత్తింది. దీంతో శిబిరంలోని 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాలికల సమాచారాన్ని తెలపాలంటూ వారి కుటుంబాలు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేస్తున్నారు. మరోవైపు, బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు.
టెక్సాస్‌లో వరద బీభత్సం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES