భారీ వర్షాలకు నిరాశ్రయులైన వేలాదిమంది
145 మంది మృతి..
తైపీ : థాయ్ లాండ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు వరదల పోటెత్తడంతో మరణించి నవారి సంఖ్య 145కి చేరింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో థాయ్ లాండ్ ప్రభుత్వం సాయుధ దళాలను సహాయక చర్యల కోసం కోసం రంగంలోకి దించింది. ఈ మేరకు థాయ్ లాండ్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.”దక్షిణ థాయ్ లాండ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు పోటెత్తి 145 మంది మరణించారు. ఆ ప్రాంతంలోని పెద్ద పెద్ద నగరాల్లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆర్మీ అధికారులు సురక్షిత ప్రదే శాలకు తరలిస్తున్నారు”అని థారు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.
థాయ్ లాండ్‌లో వరద బీభత్సం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



