Friday, November 21, 2025
E-PAPER
Homeజిల్లాలువరద బీభత్సం.. జాతీయ రహదారి ధ్వంసం!

వరద బీభత్సం.. జాతీయ రహదారి ధ్వంసం!

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలకు నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారి తీవ్ర నష్టానికి గురైంది. డిండి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వరద తాకిడికి రహదారికి కోత ఏర్పడి కల్వర్టు పూర్తిగా తెగిపోయింది. ఫలితంగా రెండు వైపులా వాహన రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రహదారి పునరుద్ధరణ పనులు ప్రారంభించగా, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలపై వెళ్ళాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -