Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడులకు నిధుల వరద.!

బడులకు నిధుల వరద.!

- Advertisement -

విద్యార్థుల సంఖ్య ఆధారంగా మంజూరు..
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ పాఠశాలలకు మొదటి విడత నిధులు మంజూరయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 50 శాతం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రధానోపాధ్యాయులకు ఊరట లభించనుంది.మండలంలో ప్రాథమిక పాఠశాలల 25,రెండు ప్రాథమికోన్నత,5 హైస్కూల్స్,ఒక కస్తూరిబ్బా, ఒక మోడల్ స్కూల్ ఉన్నాయి. ఇందులో మొత్తం 1367 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

నిధులు విడుదల ఇలా..
మండలంలో అన్ని పాఠశాలకు కలిపి స్కూల్ గ్రాంట్ 50 శాతం నిధులు రూ.2,82,500, స్పోర్ట్స్ అన్ని పాఠశాలలకు కలిపి 50 శాతం నిధులు రూ.1,25000, అన్ని పాఠశాలలకు కలిపి బడిబాట నిధులు 50 శాతం రూ.35000, హౌజ్ పార్మేషన్ కింద 5 హైస్కూళ్లకు కలిపి రూ.43,750,రెండు కాంప్లెక్స్ సముదాయాలకు 50 శాతం నిధులు రూ.33వేలు,ఎమ్మార్సీకి 50 శాతం నిధులు  రూ.45 వేలు మొదటి విడత నిధులు విడుదలయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -