Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లేండి వాగుకు వరద నీరు..

లేండి వాగుకు వరద నీరు..

- Advertisement -

గోజేగావ్ గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు
నవతెలంగాణ – మద్నూర్

శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగువ మహారాష్ట్ర నుండి పారే లేండి వాగుకు భారీగా వరద నీరు పాడుతుంది. వరదనీటి మూలంగా మద్నూర్ మండలంలోని గోజేగావ్ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ గ్రామం లెండి వాగు ఆవుతలి ఒడ్డున ఉన్నందున ఎప్పుడు వరదలచిన ఈ గ్రామ ప్రజలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఎందుకంటే లేండి వాగు కు ఓవర్ బ్రిడ్జి లేకపోవడం లో ఓవర్ బ్రిడ్జి ఉన్నందున భారీగా పారే వరద నీటితో రాకపోకలు నిలిచిపోవడం జరుగుతుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వర్షాలు పడకపోయినా మహారాష్ట్ర ప్రాంతంలో కురిసే వర్షాలకు ఎగువ నుండి పారే లేండి వాగుకు భారీగా వరద వస్తుంది. వరద నీరు ఎప్పుడు వచ్చినా మండలంలోని గోజేగావ్ ప్రజలకు రాకపోకలు నిలిచిపోయి అవస్థలు ఎదుర్కొంటారు. లేండి వాగు పైన ఓవర్ బ్రిడ్జ్ నిర్మించే వరకు ఈ గ్రామ ప్రజలు అవస్థలు పడకతప్పదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -