Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి

ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి

- Advertisement -

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న 1,51,000 క్యూసెక్కుల వరద నీరు
నవతెలంగాణ- విలేకరుల బృందం

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో జలకళ నిండుకుండలా సంతరించుకుంది. మహారాష్ట్ర పరిసర ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదు కావడంతో ఎస్సారెస్పీలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. బాలేగావ్‌ నుంచి 1,20,000 క్యూసెక్కులు, నిర్మల్‌ జిల్లా నుంచి 20వేల క్యూసెక్కులు, నిజామాబాద్‌ జిల్లా నుంచి పదివేల క్యూసెక్కులు వరద ప్రాజెక్టులోకి కొనసాగు తుండగా.. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు వెయ్యి క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,51,000 క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం.. 1086.80 అడుగులు 65.867 టీఎంసీల నీటిమట్టం కలిగి ఉంది.
నేడు నిజాంసాగర్‌ గేట్లు ఎత్తే అవకాశం..
నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 49,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్‌ ఏఈఈ సాకేత్‌, అక్షరు ఆదివారం తెలిపారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 13.000 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సోమవారం ఏ సమయానికైనా ప్రాజెక్ట్‌ నిండే అవకాశం ఉన్నందున వరద గేట్ల ద్వారా నీటిని మంజీరా నదిలోకి వదలనున్నట్టు తెలిపారు. పోచారం ప్రాజెక్టులోకి ఆదివారం భారీగా వరద కొనసాగుతున్నట్టు ప్రాజెక్టు డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 3954 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
మళ్లీ సాగర్‌లో 22 గేట్ల ఎత్తివేత
నాగార్జునసాగర్‌ జలాశయం నుండి మరోసారి ఆదివారం 22 గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ స్పిల్‌వే ద్వారా 1.71 లక్షల నీరు విడుదలవుతోంది. ఇన్‌ ప్లో 1.98 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ ప్లో 2.11 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ఆదివారం సాయంత్రానికి 586.70 అడుగులకు ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 881.40 అడుగుల మేర ఉంది. శ్రీశైలం జలాశయం నుండి మూడుగేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad