– నాళాలు ఆక్రమించి కట్టడాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి.
– మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా నాళాల వ్యవస్థను పునరుద్ధరించాలి.
– కామారెడ్డి శ్రేయస్సును ఆకాంక్షించే ప్రజలు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా నుండి జీవదాన్ పాఠశాలకు వెళ్లే దారిలో గల 40 ఫీట్ల పొడవైన నాలాను ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారని, దీనివల్లనే వర్షాలు పడినప్పుడు రోడ్లపైన నీళ్లు నిలిచిపోయి ఆ నీళ్లే ఇళ్లలోకి వచ్చి ప్రజలు ముంపు బారిన పడే విధంగా చేస్తున్నాయని కామారెడ్డి పట్టణంలోనీ ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించే కొందరు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా 40 ఫీట్ల రోడ్డు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, యంత్రాంగము ఒకసారి సందర్శించి 40 ఫీట్ల నాలాలలో ఎలాంటి ఆక్రమణలు జరిగాయో చూడాలి అని అన్నారు. వర్షాలు పడ్డప్పుడు మాత్రమే స్పందించే యంత్రాంగము దీనికి కారకులైన వారి పైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందనీ, ప్రత్యక్ష నిదర్శనంగా నాలాపైన పెద్ద పెద్ద భవనాలు కట్టినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఆ వైపు తొంగి చూడడానికే అధికార యంత్రాంగము భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
కోట్లాది రూపాయల ఆస్తి నష్టం నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంభవించింది దానికి ప్రత్యక్ష పరోక్ష కారకులు అధికార యంత్రాంగమే ఇప్పటికైనా చిత్తశుద్ధితో మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా నాలాలను ఒకసారి ప్రత్యక్షంగా తనిఖీ చేసి ఆక్రమించిన వాటి యొక్క భవనాలను తొలగించినట్లయితే భవిష్యత్తులో కామారెడ్డికి ఎంతో ముప్పును తప్పించిన వారవుతారనీ అన్నారు. దీనికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించి కామారెడ్డి అభివృద్ధిని కాంక్షించే ప్రజల సమస్యలను తొలగించే వారిగా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలు పాల్గొనడం జరిగింది.
నాలాల ఆక్రమణతోనే ప్రజలకు వరద కష్టాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES