- Advertisement -
పూలు చుక్కల కన్నా
అందంగామెరుస్తాయెందుకు?
బహుశా
సీత జడలో ఒదుగుతాయనా
లేదా
సీతే
అసలు పూల వారసురాలనా
కానీ……..
పూలకు సున్నిత స్త్రీ భాష
తెలిసినంతగా
కఠిన మనుషుల భాష
తెలియదేమో?
సీతను నలిపినంత
హదయ విదారకంగా
నలుపుతారని విననే లేదేమో?
చోద్యం కాకపోతే………..
చంద్రుడు గుడ్డివాడా?
మరి మంచివాడా?
లేదా చుక్కలే
అందంగా తోచలేదా?
ప్రతి రాత్రికీ
చంద్రుని చుట్టూ
హాయిగా విహరిస్తాయి.
కానీ………..
పగలూ, రాత్రీ తేడా లేక
స్త్రీలనే పూల రెక్కలు
విరుగుతూనే ఉంటాయి..
తనువు రాలుతూనే ఉంటాయి..
మరప్పుడు
మనుషులనే తుమ్మెదలు
గుడ్డివారు కాదనే కదా!
పూలు చుక్కల కన్నా
అందంగా ఉన్నాయనే కదా!!
- పి. మదుల, 7093470828
- Advertisement -



