Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ప్లయింగ్ స్క్వాడ్

తాడిచెర్ల ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ప్లయింగ్ స్క్వాడ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం ప్లయింగ్ స్క్వాడ్ బృందం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కాడ్ బృందం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా మూడవరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆంగ్ల పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులపై అరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం విద్యార్థులు 111 గాను 107 మంది విద్యార్థులు పరీక్షకు హాజరై మిగతా నలుగురు విద్యార్థులు గైహాజరైయ్యారు. అలానే ఒకేషనల్ కోర్స్ విద్యార్థుల్లో మొత్తం 15 మందికి గాని 13 మంది విద్యార్థులు హాజరై ఇద్దరు విద్యార్థులు గైహరైయ్యారని పరీక్ష సెంటర్ చీఫ్ సూపరిండెంట్ కరుణాకర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -