అడ్వర్టయిజ్‌మెంట్లను వాడుకోండి : ఆర్టీసీపై సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తోందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే టిక్కెట్ల ద్వారా వస్తున్న ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై కూడా దృష్టి సారించాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… ఆర్టీసీలో ఇప్పటి వరకు 237 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్‌ను ఉపయోగించుకున్నారని తెలిపారు. ఇందుకుగాను తమ ప్రభుత్వం ఆర్టీసికి రూ.7,980 కోట్లను చెల్లించిందని వివరించారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో వాడే టిమ్ మిషన్లతోపాటు టిక్కెట్లపై అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా ఆదాయాన్ని మరింతగా పెంచుకోవాలని సూచించారు.
ప్రస్తుతం తాండూరు, వికారాబాద్, బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్‌సుఖ్‌నగర్, హకీంపేట్, రాణిగంజ్, మిథానితోపాటు పలు డిపోలు నష్టాల బారిన పడటానికి గల కారణాలు, స్థానిక పరిస్థితులు, ఆయా డిపోలు లాభాల బాట పట్టటానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీని వేయాలంటూ ఆర్టీసీ ఎమ్‌డీ నాగిరెడ్డిని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుకునేలా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని కోరారు. నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయనీ, పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్‌కి కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారిగా రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలను కల్పించాలని పొన్నం సూచించారు. మధిర బస్ స్టేషన్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. హుజూర్‌నగర్, కోదాడ బస్ స్టేషన్ల శంకుస్థాపనను వారం రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మిర్యాలగూడ బస్ స్టేషన్ అప్ గ్రేడేషన్ పనులను కూడా ప్రారంభించాలంటూ ఆయన ఆదేశించారు.
అదనపు ఆదాయంపై దృష్టి సారించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



