Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టండి

రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టండి

- Advertisement -

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రెండేండ్లుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లను రిపేరు చేయలేదని దీంతో ప్రయాణం అసౌకర్యంగా ఉందని పలువురు ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతుల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. వారితో పాటు పలు నియోజక వర్గాల్లోన్ని సమస్యలపై సుమారు 20మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, ఎంఐఎం సభ్యుడు జాఫర్‌ హుస్సేన్‌, సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు తదితరులు పలు అంశాలను లేవనెత్తారు. రోడ్లు, ప్లైఓవర్లు, నీటి పారుదల, హాస్టళ్లు, ఉద్యోగుల సమస్యలు, వారి టీఏ, డీఏల సమస్యలను ఏకరువు పెట్టారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ సరఫరాను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జనాభాలో 50 శాతంగా ఉన్న బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వారి సంక్షేమానికి ఈ బడ్జెట్‌ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు రూ. 10 వేల కోట్ల వరకు ఉన్నాయని, వెంటనే వాటిని ప్రభుత్వం చెల్లించాలని కోరారు. కాంగ్రెస్‌ సర్కారు యూరియా యాప్‌ పేరుతో రైతులను వేధిస్తున్నదన్నారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతుల దగ్గర స్మార్ట్‌ఫోన్‌లు లేవనీ, ఇక స్మార్ట్‌ ఫోన్‌లు ఉన్న 50 శాతం మందిలో కూడా 50 శాతం మందికి యాప్‌ను ఎలా ఉపయోగించాలో తెలియదని తెలిపారు. మొత్తంగా 75 శాతం మంది రైతులు యూరియా యాప్‌తో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండలానికి ఒక్క కేంద్రంలో మాత్రమే యూరియా ఇస్తుండటంతో చాలా గ్రామాల రైతులు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కాబట్టి మండలానికి ఒక్కచోట మాత్రమే కాకుండా ఎక్కువచోట్ల యూరియా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. దఫాకు 5 బస్తాల పరిమితిని ఎత్తేసి, రైతు వేసిన పంటకు ఎంత యూరియా అవసరమో అంతా ఒకేసారి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ నగరంలో 118జీవో, ఆతర్వాత పరిణామాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నామనీ, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్తామనీ మంత్రులు శ్రీధర్‌బాబు, వాకటి శ్రీహరి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -