Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి

- Advertisement -

మండల ప్రత్యేక అధికారి
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామాల్లో నెలకొంటున్న ప్రజలు సమస్యలను ఎప్పటికప్పుడు పరిస్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని మండల ప్రత్యేక అధికారి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు ఆదేశించారు. మండల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ఎంపిడిఓ క్రాoతికుమార్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులు,ఎంజిఎన్ఆర్ఇజిఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యం,మంచినీరు,డ్రైనేజీల పరిశుభ్రత తదితర అంశాలపై కార్యదర్శులతో సమీక్షించారు. ప్రతి ఉపాధిహామీ కూలికి పని కల్పించేలా జాబ్ కార్డులు లేనివారికి జాబ్ కార్డులు అందజేస్తూ ఈకెవైసి చేయాలని ఈజిఎస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు,ఈజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -