నేడు పంజాబ్‌తో సన్‌రైజర్స్ ఢీ
ముల్లాన్‌పూర్ : ఐపీఎల్19లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. వర్షం అంతరాయంతో నైట్‌రైడర్స్‌తో పాయింట్లు పంచుకున్న పంజాబ్ కింగ్స్ అజేయంగా కొనసాగుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గత మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఉత్కంఠ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ నేటి మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపైనే నేడు ఫోకస్ కనిపిస్తోంది. ఐపీఎల్‌లో చివరగా ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మరో 8 బంతులు ఉండగానే ఊదేసింది.
అభిషేక్ శమ్ర 55 బంతుల్లో 141 పరుగుల సునామీ సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటములు చవిచూసినా.. ఆ జట్టు బ్యాటింగ్ పవర్ ఏమాత్రం తగ్గలేదు. ఈ సీజన్‌ల్లో బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమైంది. అభిషేక్ శర్మ, ట్రావిశ్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లో ఏ ఇద్దరు నిలబడినా సన్‌రైజర్స్‌కు ఎదురుండదు. నితీశ్ కుమార్ రెడ్డి, అనికెత్ వర్మలు నిలకడగా రాణించటం సన్‌రైజర్స్‌కు సానుకూలం. ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ సరికొత్తగా కనిపిస్తోంది. బ్యాట్‌తో, బంతితో ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది. ఇరు జట్లలోనూ విధ్వంసక బ్యాటర్లకు కొదవ లేదు. నేడు ముల్లాన్‌పూర్‌లో పరుగుల పండుగ ఖాయమే. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నేడు మధ్యాహ్నాం 3.30 గంటలకు ఆరంభం.



