Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజానపద కళలు మన సంస్కృతి మూలాలు

జానపద కళలు మన సంస్కృతి మూలాలు

- Advertisement -

– కళాబంధు డాక్టర్‌ పి.అనూహ్యా రెడ్డి
– ఎస్వీకేలో జానపద జనజాతర
నవతెలంగాణ – ముషీరాబాద్‌

జానపద కళలు మన మనుగడ, సంస్కృతి మూలాలు అని, ఈ నేల వాసన తెలియజేసే శక్తి జానపద కళారూపాల్లోనే ఉందని కళాబంధు డాక్టర్‌ పి.అనూహ్యారెడ్డి అన్నారు. అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొవిద సహృదయ ఫౌండేషన్‌ సహకారంతో కొవిద ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జానపద జనజాతర ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ఒక ప్రాంత చరిత్ర, కష్టాలు, ఆనందాలు, అక్కడి మనుషుల మనస్తత్వం అన్నీ కళారూపాల్లో ప్రతిబింబి స్తాయని తెలిపారు. ఈ తరహా వేడుకలను ఉత్సవాలుగా కాకుండా, సంస్కృతి సంరక్షణ యజ్ఞాలుగా భావించాల న్నారు. జానపద కళలను ముందు తరాలకు పరిచయం చేసి ప్రోత్సాహం ఇవ్వడం మనందరి సామాజిక బాధ్యత అన్నారు. జానపద కళాకారులు కేవలం వినోదం అందించే వారు కాదని, సమాజ విలువలను, సమైక్యతను చాటే మహానుభావులని కొనియాడారు. తెలంగాణలోని జానపద కళాకారులు తమ ప్రతిభతో ప్రపంచానికే గర్వకారణం కావాలన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల కళాకారులు తమ జానపద నృత్య, గేయ, వాద్య కళా రూపాలను ప్రదర్శించారు. నృత్య గురువులను అనూహ్యారెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జానపద గాయకుడు, దర్శకులు కె.నరసింహ, మాజీ ఎంపీటీసీ అట్ల రవీందర్‌ రెడ్డి-మంజుల దంపతులు, చినుకు మూర్తి, భూపతి వెంకటేశ్వర్లు, హిమబిందు, రాములు, విజ్ఞానదర్శిని టి. రమేష్‌, నృత్య గురువులు లావణ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -