నవతెలంగాణ – కామారెడ్డి
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు,వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం, త్రాగు నీటిని కొత్త బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, జీ ఆర్ కాలనీ,నేషనల్ హై వే లో చిక్కుకున్న ప్రయాణికులకు దాదాపు 500 మందికి పైగా ఈ ఆహారపు పొట్లాలు మరియు త్రాగు నీటిని అందించడమే కాకుండా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి గారి నేతృత్వంలో జాతీయ రహదారిపైన చిక్కుకున్న ట్రాఫిక్ క్లియరెన్స్ కు పోలీస్ శాఖకు సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని,వీలైనంత సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వారు సూచించారు. ఈ ఆహార పొట్ల తయారీలో సహకరించిన ఆర్ కే విద్యా సంస్థలకు, వాకర్ అసోసియేషన్ ప్రతినిధులకు రోటరీ క్లబ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ ట్రెసరర్ వెంకటరమణ, పాస్ట్ ప్రెసిడెంట్ రాజనర్సింహ రెడ్డి, రోటరియన్స్ సుధాకర్, నవీన్, దత్తాత్రి,సుధాకర్ రావు, రాజేశ్వర్ రావు,శివాజీ రావు,నాగరాజు,విజయ్ కుమార్ ,స్వామి తదితరులు పాల్గొన్నారు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వరదల్లో చేరుకున్న ప్రజలకు ఆహారం తాగునీరు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES