Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏరువాక పౌర్ణమి సందర్భంగా అన్నవితరణ

ఏరువాక పౌర్ణమి సందర్భంగా అన్నవితరణ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి  : మండలంలోని ఉప్లూర్ లో బుధవారం ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ షిరిడి సాయి ఆలయం వద్ద అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షిరిడి సాయి ఆలయాన్ని మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. ఆలయ పూజారి హన్మాండ్లు మంత్రోచరణాల మధ్య  బాబా విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు.భక్తుల సాయి నామస్మరణతో పల్లకి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నవితరణ చేశారు.కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బద్దం గంగారెడ్డి, ఎనుగందుల శశిధర్, ఊట్నూరి రవి గౌడ్, పోతు గణేష్, నందగిరి దయానంద్, పసుపుల రాజేందర్, అమరగోని సదాశివ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -