Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ లలితాదేవి ఆశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం

శ్రీ లలితాదేవి ఆశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రం శివారులోని మెట్ పల్లి రోడ్డులో గల శ్రీ లలితాదేవి (రామానంద) ఆశ్రమంలో గురువారం పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ లలితా దేవి ఆశ్రమం వ్యవస్థాపకులు స్వర్గీయ రామనంద సరస్వతి స్వాముల వారి చిరకాల కోరిక మేరకు గత మూడు రోజులుగా జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ మధ్య జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆశ్రమానికి విచ్చేసిన భక్తులు, గ్రామస్తులు  అన్న ప్రసాదం స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -