- Advertisement -
నవతెలంగాణ గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని పవన్ యూత్ గణేష్ మండలి తోపాటు మండల కేంద్రంలోని వివిధ గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధారి మాజీ జడ్పీటీసీ సభ్యులు తానాజీరావు పవన్ యూత్ గణేష్ మండలి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ యూత్ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పెద్ద సంఖ్యలో హజరయ్యారు.
- Advertisement -