నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలో గల బండారి గ్రూప్స్ విజయలక్ష్మి హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గురువారం ఏర్పాటు చేశారు. మొదట ఆస్పత్రి వైద్యురాలు బండారి సుజాత, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ నాగమోహన్ దంపతులు కలిసి వినాయకుడికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి, టీజీవో అధ్యక్ష కార్యదర్శులు అలుక కిషన్ అమృత్ కుమార్, అలాగే టౌన్ సిఐలు శ్రీనివాస్ రాజ్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి,ఎస్సైలు గంగాధర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యురాలు బండారి సుజాత, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ నాగమోహన్ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆస్పత్రి ఆవరణంలో వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. అలాగే ప్రతి గురువారం తమ ఆస్పత్రి ఆవరణంలో రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమం సైతం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే హాస్పటల్ సిబ్బందికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.