- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రంలోని స్నిగ్ధ కాలనీలో గణపతి నవరాత్రులు సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజల్లో భాగంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బాగావత్గీత పారాయణం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు ఎలుగాల రాజయ్య, ప్రధాన కార్యదర్శి రఘుపతి రెడ్డి, కోశాధికారి వెల్లంకి పురుషోత్తం రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రత్న బాలరాజు, కాలనీ గౌరవ సలహాదారు దిద్ది బాలాజీ, రామచంద్రారెడ్డి, సభ్యులు ప్రభాకర్ రెడ్డి, జక్క వెంకట్ రెడ్డి, గంగుల యాదగిరి, కాలనీవాసులు పాల్గొన్నారు.
- Advertisement -