Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్ వద్ద లయన్స్  క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ (ఐపిఐడి) అన్నబంధు  బాబురావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్మర్ పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లుక్కా గంగాధర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషల్ డైరెక్టర్ అన్నబంధు బాబురావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అన్నబంధు బాబురావు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదల కోసం ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి వారన్నారు.వారి జన్మదినం  సందర్భంగా కమ్మర్ పల్లిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో వారి స్పూర్తితో లయన్స్ క్లబ్  కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్  సభ్యులు పాలేపు నర్సయ్య, బద్దం రాజశేఖర్, పడిగేలా ప్రవీణ్, నోముల నరేందర్, సుంకరి విజయ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -