- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామ భార్గవి పాఠశాల యందు శనివారం ఫుడ్ ఫెస్ట్, పేరెంట్స్ సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రగతి పట్వారి రిబ్బన్ కట్ చేసి ఫుడ్ పేస్టును ప్రారంభించినారు. 80 రకాల వంటలను విద్యార్థులు ప్రదర్శించి స్టాళ్లను ఏర్పాటు చేసినారు. పాఠశాలకు వచ్చిన అవార్డులను సైతం ప్రదర్శించినారు. తల్లిదండ్రులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి, వారి ప్రతిభను అభినందించినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గోపికృష్ణ , వాసు, హారిక, భారత్, సుష్మిత ,పూజ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



