- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఫుడ్ పాయిజన్ కావడంతో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన కరీంనగర్ జిల్లాలో నెలకొంది. జమ్మికుంటకు చెందిన ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో గమనించిన పాఠశాల సిబ్బంది.. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పాఠశాలలో కలకలం రేపింది.
- Advertisement -


