విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ..

నవతెలంగాణ- మియాపూర్ 
రంగారెడ్ది జిల్లా  చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా దక్షిత సమితి బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సుమన్ హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం హాస్టల్‌లో ఆహారం తీసుకున్న విద్యార్థుల్లో 50 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వారిని హాస్టల్ యాజమాన్యం వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 50 మందిలో ప్రస్తుతం ఆరుగురు పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై కాలేజీ యాజమాన్యాన్ని వివరణ కోరగా.. మా దగ్గర ఎవరికీ ఫుడ్ పాయిజన్ కాలేదని, మంజీరా నీటి సరఫరాలో కల్తీ నీరు సరఫరా కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని మహిళా దక్షిత సమితి బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సుమన్ హాస్టల్ యాజమాన్యం తెలిపింది. కలుషిత నీటి సరఫరాపై మియాపూర్ ఏరియా వాటర్ వర్స్క్ అధికారి నాగప్రియను వివరణ కోరగా మంజీరా నీటి సరఫరాలో ఎలాంటి కలుషితం జరగలేదని, నీరు కలుషితం అయితే మియాపూర్ డివిజన్ పరిధిలో అంతటా జరుగుతుందని, కేవలం ఒకే చోట ఎలా జరుగుతుందన్నారు. ఇదే  అంశంపై ఫుడ్ సేఫ్టీ అధికారులను వివరణ కోరగా తమ పరిధిలో కాలేదంటూ చేతులు తీస్తున్నారు. ప్రధానంగా విద్యాశాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ, శానిటేషన్ అధికారం నిర్లక్ష్యం కనబడుతుందని విద్యార్థి సంఘం అన్నారు. కాలేజీ యాజమాన్యం పై కట్టిన చెరువు తీసుకోవాలి నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్వహిస్తున్న కాలేజీ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శంకర్ అన్నారు. సేవ పేరుతో ట్రస్టులు ఏర్పాటు చేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటున్నారని గుర్తు చేశారు ఇలాంటి విద్యా సంస్థలపై ప్రభుత్వం కఠినంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
Spread the love