Saturday, February 21, 2026
E-PAPER
Homeక్రైమ్కేజీబీవీలో ఫుడ్‌ పాయిజన్‌

కేజీబీవీలో ఫుడ్‌ పాయిజన్‌

- Advertisement -

– 25మంది విద్యార్థినులతోపాటు.. నలుగురు ఇంటర్నల్‌ మార్క్ప్‌ వెరిఫికేషన్‌ సభ్యులకు అస్వస్థత
– మెదక్‌ జిల్లా రేగోడ్‌లో ఘటన
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్‌ పాయిజన్‌ వల్ల 25మంది విద్యార్థినీలతో పాటు ఇంటర్నల్‌ మార్క్స్‌ వెరిఫికేషన్‌కు వచ్చిన నలుగురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పలువురు బాలికలకు వాంతులవడంతో ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులు గురువారం మధ్యాహ్నం, రాత్రి ఎప్పటిలాగే పాఠశాల మెస్‌లో భోజనం చేశారు. అనంతరం వరుసగా వాంతులు చేసుకోవడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం 15 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్‌ చేశారు. మరో 10 మంది బాలికలు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మెదక్‌ జిల్లా డీఈఓ విజయ, ఎంఈఓ గురునాథ్‌, అల్లాదుర్గం సీఐ రేణుక ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి భోజన నాణ్యత, తాగునీటి సౌకర్యాలపై విచారణ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -