Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆహార వృధాను అరికట్టాలి 

ఆహార వృధాను అరికట్టాలి 

- Advertisement -

లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్
నవతెలంగాణ – కట్టంగూర్
వృధా ఆహార వినియోగాన్ని అరికట్టడం సామూహిక బాధ్యత అని లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్  ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్ అన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి వెంట ఉన్న హోటల్ యజమానులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.పెళ్లిళ్లు, శుభకార్యాలు, హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, వేడుకలలో టన్నుల కొద్దీ ఆహారం చెత్తబుట్టల్లో పడేస్తున్నారని దేశంలో ఏటా కోట్ల రూపాయల విలువైన ఆహారం వృధా అవుతుందన్నారు. లక్షలాది మంది రోజుకు ఒక పూట ఆహారం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆహారం విలువ తెలుసుకొని వృధాను అరికట్టాలన్నారు.

ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, కేటరింగ్ నిర్వాహకులు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని,మిగిలిన భోజనాన్ని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, రాత్రి ఆశ్రయ కేంద్రాలకు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలి.ఆహారం వృథా చేయకూడదు అనే భావనను ప్రతి ఒక్కరిలో కలిగినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్ కల్లూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి పోగుల రాములు, బసవోజు వినోద్ కుమార్,గోషిక ఉమాపతి, మంగదుడ్ల శ్రీనివాస్, చెరుకు శ్రీనివాస్, ఎలుక ప్రసాద్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -