నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. రెండు రోజులు తిండి లేకపోయినా ఉండొచ్చు. కానీ ఒక్క రోజు నిద్ర సరిగా లేకపోయినా.. మనిషి మనిషిగా అస్సలు ఉండలేరు. శరీరంలో హార్మోన్లు కూడా ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. మంచి నిద్ర కోసం ఎంతో పరితపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో నిద్ర అనేది చాలా కష్టంగా మారుతుంది. పనుల ఒత్తిడి, టెన్షన్లు కారణంగా నిద్ర అస్సలు పట్టడం లేదు. దీని వలన అనేక దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతున్నారు. రాత్రి పూట సరిగా నిద్రపోకపోతే డయాబెటీస్, క్యాన్సర్, బీపీ వంటి సమస్యలు ఎటాక్ చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మంచి నిద్ర కోసం పరితపించే వాళ్లు ఇప్పుడు చెప్పే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నిద్ర క్వాలిటీ పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.
గోరు వెచ్చని పాలు:
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుందని ఇంట్లో పెద్ద వాళ్లు, ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూ ఉంటా రు. అంతే కాదు పలు అధ్యయనాల్లో రాత్రి పడు కునే ముందు గోరు వెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని తేలింది. కాబట్టి మంచి నిద్ర పట్టాలంటే గోరు వెచ్చని పాలు తాగండి.
బాదం పాలు:
రాత్రి పూట గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. బాదం పాలు కూడా ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే బాదం పాలులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా శరీరంలోని కండరాలను కూడా రిలాక్స్ చేస్తుంది.
గోల్డెన్ మిల్క్:
రాత్రి పడుకునే ముందు గోల్డెన్ మిల్క్ అదేనండి పసుపు పాలు తాగడం వల్ల కూడా నిద్ర చక్కగా పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పాలు తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
అల్లం టీ:
నిద్ర చక్కగా పట్టడంలో అల్లం టీ కూడా ఎంతో చక్కగా సహాయ పడుతుంది. శరీరాన్ని కూడా రిలాక్స్ చేస్తుంది. శరీర నొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు అల్లం టీ తాగడం బెటర్. అయితే కేవలం నీటిలో అల్లం వేసి మరిగించిన టీని మాత్రమే తాగాలి. ఇందులో టీ పొడి, పంచదార, పాలు వంటివి కలపకూడదు.
గాఢ నిద్ర కోసం…
- Advertisement -
- Advertisement -