Sunday, April 5, 2026
E-PAPER
Homeసోపతిఇంటర్‌ తర్వాత బంగారు భవిష్యత్తుకు…

ఇంటర్‌ తర్వాత బంగారు భవిష్యత్తుకు…

- Advertisement -

పరీక్షల ఒత్తిడిని అధిగమించి, ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థి లోకానికి, వారికి వెన్నంటి నిలిచిన తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్‌ అనేది మైలురాయి వంటిది. ఇక్కడి వరకు ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుండి వేసే ప్రతి అడుగు వారి జీవిత గమనాన్ని మార్చివేస్తుంది. ఇంటర్‌ తర్వాత మనం ఎంచుకునే కోర్సు కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదు, అది మన కెరీర్‌ పునాది. ప్రపంచం వేగంగా మారుతోంది, కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి. సరైన అవగాహన, లక్ష్యశుద్ధి, ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకుంటే, ఇంటర్మీడియట్‌ ద్వారా పొందిన జ్ఞానం ఒక ఉన్నతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి గొప్ప ఇంధనంగా మారుతుంది. రేపటి పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలవాలంటే, ఈ కీలక సమయంలో తీసుకునే నిర్ణయమే అత్యంత ప్రధానం.

సైన్స్‌ విద్యార్థులకు – కెరీర్‌ ప్లానింగ్‌ : ఇంటర్మీడియట్‌ సైన్స్‌ (MPC/ BiPC) పూర్తి చేసిన విద్యార్థులకు ప్రపంచం వేదికగా నిలుస్తుంది. కేవలం ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ మాత్రమే కాకుండా, అద్భుతమైన అకడమిక్‌ కోర్సులు, ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలు నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విభాగాలు సైన్స్‌ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.
అకడమిక్‌ కోర్సులు (Academic Courses): సైన్స్‌ రంగంలో పరిశోధనలు చేయాలనుకునే వారికి, బోధనా రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సులు పునాది వేస్తాయి.
B.Sc (MPC): Maths, Physics & Chemistry – ఇది సాంప్రదాయకమైన ఎంతో డిమాండ్‌ ఉన్న కోర్సు.
B.Sc (MPCs): Maths, Physics & Computer Science -సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఉత్తమ ఎంపిక.
B.Sc (MCCs): Maths, Chemistry & Computer Science – కెమిస్ట్రీ & కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుని చదవచ్చు.
జీవశాస్త్ర విద్యార్థులకు (B.Z.C & Others): వైద్యేతర రంగాల్లో అద్భుతాలు సృష్టించాలనుకునే వారికి ఇవి వరం.

B.Z.C: Botany, Zoology & Chemistry. B.Sc Microbiology: సూక్ష్మజీవుల శాస్త్రంపై పట్టు సాధించడానికి.
B.Sc Biotechnology: జీవసాంకేతికత రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం.
Bio Chemistry: జీవ రసాయన శాస్త్రం.
MLT (Vocational): వైద్య పరీక్షల రంగంలో తక్షణ ఉపాధికి మార్గం.
ఆర్ట్స్‌ (B.A): సైన్స్‌ చదివిన విద్యార్థులు కూడా సివిల్స్‌ లేదా గ్రూప్స్‌ లక్ష్యంగా B.A కోర్సులను ఎంచుకోవచ్చు.
E.H.P: Economics, History & Political Science, T.H.P: Telugu, History & Political Science. English, History & Public అడ్మినిస్ట్రేషన్‌,
Telugu Literature & English Literature. ప్రవేశ పరీక్షలు (Entrance Examinations): ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొంది, ప్రొఫెషనల్‌ కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

EAMCET: ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ కోర్సుల కోసం,
TGRDC & APSRDC: గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి,
DEE CET (T.T.C): ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ ఉన్నవారికి.
B. Pharmacy & D. Pharmacy: ఫార్మా రంగంలో స్థిరపడటానికి.
B.Sc Agriculture & B.Sc Veterinary: వ్యవసాయం, పశువైద్య రంగాల్లో నిపుణులుగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
Integrated P.G.: ఐదేళ్ల ఉమ్మడి పీజీ కోర్సులు.
పోటీ పరీక్షలు – తక్షణ ఉద్యోగ అవకాశాలు (Competitive Exams & Jobs)
ఇంటర్‌ పూర్తి కాగానే దేశ సేవ చేయాలన్నా లేదా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలన్నా ఈ కింది విభాగాలు గొప్ప వేదికలు. రక్షణ రంగం (Defence): Army (MPC విద్యార్థులకు ప్రత్యేకం), Navy, Air Force (Pilot – Physics Merit ఉండాలి), NDA (National Defence Academy), CDS (Combined Defence Service). అలాగే BSF,CISF, CRPF, RPF వంటి విభాగాల్లో కొలువులు సాధించవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు: VRO/VRA,Police Constable (Civil, Excise,APSP & TGSP Fire),DSC ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు: Railway(RRC), SSC (Staff Selection Commission), పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగాలు. ఇతరాలు: Army Truck Drivers వంటి ప్రత్యేక విభాగాలు.
సైన్స్‌ విద్యార్థులు పైన పేర్కొన్న కోర్సులలో తమ ఆసక్తికి తగిన దానిని ఎంచుకుంటే, వారు కేవలం పట్టభద్రులుగానే కాకుండా, దేశ గమనాన్ని మార్చే మేధావులుగా, రక్షణ రంగ సైనికులుగా, అద్భుతమైన శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. ఆర్ట్స్‌, కామర్స్‌ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు – కెరీర్‌ గైడెన్స్‌ చాలామంది పొరపాటున ఆర్ట్స్‌ లేదా కామర్స్‌ అంటే తక్కువ అని భావిస్తారు. కానీ, నేటి సమాజంలో అత్యున్నత స్థాయి సివిల్‌ సర్వెంట్లు (IAS, IPS), గొప్ప న్యాయవాదులు, ఆర్థికవేత్తలు, పరిపాలనా దక్షులుగా ఎదిగే అవకాశం ఈ విభాగాల విద్యార్థులకే ఎక్కువగా ఉంటుంది.
ఇంటర్‌ తర్వాత ఆర్ట్స్‌ విద్యార్థులకు ఉన్న అపారమైన అవకాశాలు, అకడమిక్‌ కోర్సులు (Academic Courses: B.A/B.Com). డిగ్రీ స్థాయిలో ఈ కోర్సులను ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవచ్చు. B.A(E.H.P): Economics, History & Political Science – ఇది గ్రూప్స్‌, సివిల్స్‌ రాయాలనుకునే వారికి అత్యంత అనుకూలమైన కోర్సు.

B.A (T.H.P): Telugu, History & Political Science – మాతృభాషపై మక్కువతో పాటు చరిత్రను అధ్యయనం చేయవచ్చు.
B.A (English, History &Public Administration): పాలనారంగం (Administration) పై ఆసక్తి ఉన్నవారికి ఇది సరైన ఎంపిక.
Literature: తెలుగు, ఇంగ్లీష్‌ సాహిత్యాలపై (Telugu Literature/English Literature) పట్టు సాధించాలనుకునే వారికి. HEC:History, Economics & Civics -సమగ్ర సామాజిక శాస్త్ర అధ్యయనానికి ఇది పునాది.
CEC: Commerce, Economics& Civics -అటు బ్యాంకింగ్‌ రంగం ఇటు ప్రభుత్వ విభాగాలపై ఆసక్తి ఉన్నవారికి ఉత్తమమైనది.
ప్రవేశ పరీక్షలు (Entrance Examinations). ఉన్నత విద్యా సంస్థల్లో సీటు సంపాదించడానికి, వృత్తి విద్యలను అభ్యసించడానికి ఈ ప్రవేశ పరీక్షలు రాయవచ్చు : APRDC & TGRDC: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో (Gurukulam) ఉచిత విద్యావకాశాల కోసం.
DEE CET (T.T.C): చిన్న పిల్లలకు పాఠాలు బోధించే టీచర్‌ కావాలనుకునే వారి కోసం.
LAWCET: న్యాయవాదిగా (Lawyer) సమాజానికి సేవ చేయాలనుకునే వారికిపోటీ పరీక్షలు – తక్షణ ఉద్యోగ అవకాశాలు (Competitive Exams & Jobs) : ఆర్ట్స్‌ విద్యార్థులు కూడా దేశ సేవలో భాగంగా రక్షణ, పోలీసు శాఖల్లో అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకోవచ్చు. ఇంటర్‌ తర్వాత మీరు దరఖాస్తు చేసుకోగలిగే ఉద్యోగ విభాగాలు. పోలీసు, రక్షణ శాఖలు:Police
Constable (Civil, Excise, APSP & Fire), రక్షణ రంగంలోని BSF, CISF, CRPF, RPF వంటి విభాగాలు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు:SSC (Staff Selection Commission) ద్వారా వివిధ శాఖల్లో పోస్టింగ్స్‌ పొందవచ్చు. అలాగే రైల్వే (RRC), పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌, ఆర్మీలో ట్రక్‌ డ్రైవర్‌ వంటి పోస్టులకు అర్హత సాధించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు: గ్రామ స్థాయిలో VRO/VRA పోస్టులు, అలాగే ణూజ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టవచ్చు. ఆర్ట్స్‌, కామర్స్‌ విద్యార్థులకు సమాజాన్ని విశ్లేషించే శక్తి ఎక్కువగా ఉంటుంది. పైన పేర్కొన్న కోర్సులు, పోటీ పరీక్షల ద్వారా వారు ఉన్నత స్థానాల్లో స్థిరపడవచ్చు. ఏ రంగం ఎంచుకున్నా క్రమశిక్షణతో చదివితే విజయం మీ సొంతం.
ఇంటర్‌ తర్వాత కెరీర్‌ – వృత్తి విద్యా కోర్సులు & ప్రొఫెషనల్‌ కెరీర్‌: ఇంటర్మీడియట్‌ తర్వాత విద్యార్థుల ముందు ఒక మహా సముద్రమంత సమాచారం ఉంది. కేవలం సంప్రదాయ కోర్సులే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా వందలాది వత్తి విద్యా కోర్సులు (Vocational & Professional Courses) అందుబాటులోకి వచ్చాయి.

వైద్య, ఆరోగ్య రంగం (Medical &Allied Health Sciences): కేవలం MBBS మాత్రమే కాకుండా, ఆరోగ్య రంగంలో రాణించడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ప్రధాన కోర్సులు: BDS (దంత వైద్యం), B.V.Sc (పశు వైద్యం), ఆయుర్వేదం (BAMS), హోమియోపతి (BHMS), యునానీ (BUMS), నేచురోపతి (BNYS),ఫార్మసీ:Pharm.D (6 ఏళ్లు), B.Pharm, D.Pharm. నర్సింగ్‌: B.Sc Nursing, GNM, ANM.
అప్లైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌: నేటి కాలంలో వీటికి డిమాండ్‌ పెరుగుతోంది. B.Sc లో అనస్థీషియా, కార్డియాక్‌ టెక్నాలజీ, రేడియాలజీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, డయాలసిస్‌, ఆప్టోమెట్రీ వంటి ప్రత్యేక కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు ఫిజియోథెరపీ (B.P.T), ఆక్యుపేషనల్‌ థెరపీ (BOT) కూడా అద్భుతమైన ఎంపికలు.
ఇంజనీరింగ్‌ & టెక్నాలజీ (Engineering – Future Tech): MPC విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌, కోర్‌ ఇంజనీరింగ్‌ రంగాల్లో కొత్త ట్రెండ్స్‌ వచ్చాయి. సంప్రదాయ విభాగాలు: ECE, EEE, Civil,
Mech.
ఆధునిక విభాగాలు: AI & ML (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), డేటా సైన్స్‌ (D.S), సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (IoT).
ప్రత్యేక విభాగాలు: అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ (B.Arch), ఏరోనాటికల్‌, ఫుడ్‌ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ. అగ్రికల్చర్‌ & ఫారెస్ట్‌ సైన్సెస్‌: ప్రకృతి, వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారికి: B.Sc Agriculture, Forestry, Horticulture, Sericulture(పట్టు పరిశ్రమ), Fisheries (మత్స్య పరిశ్రమ) హోమ్‌ సైన్స్‌.
మేనేజ్‌మెంట్‌ & కామర్స్‌ (Management & Professional Accounting): వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారికి. కోర్సులు: BBA, MBA (ఇంటిగ్రేటెడ్‌), దీదీవీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (B.H.M.C.T).
ప్రొఫెషనల్‌ కోర్సులు: CA (Chartered Accountant), CS (Company Secretary),CWA, CFA, స్టాక్‌ బ్రోకింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కోర్సులు. క్రియేటివ్‌ & మీడియా రంగం (Film, Media & Design). సృజనాత్మకత ఉన్న విద్యార్థులకు ఇవి బంగారు బాటలు.
ఫిల్మ్‌ మేకింగ్‌: యాక్టింగ్‌, డైరెక్షన్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌.డిజైనింగ్‌: ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌, జ్యువెలరీ డిజైనింగ్‌. మీడియా, జర్నలిజం (BJMC), మాస్‌ కమ్యూనికేషన్‌, వెబ్‌ డిజైనింగ్‌, యానిమేషన్‌.
ఇతర వృత్తి విద్యా కోర్సులు & డిఫెన్స్‌ (Vocational & Defence). రక్షణ రంగం: నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ (పైలట్‌ ట్రైనింగ్‌), ఎన్‌.డి.ఏ (NDA).
షార్ట్‌ టర్మ్‌ కోర్సులు: బ్యూటీ కల్చర్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ట్రావెల్‌ & టూరిజం, ఎయిర్‌ హోస్టెస్‌, లైబ్రరీ సైన్స్‌. ఓపెన్‌ లెర్నింగ్‌: దూర విద్య ద్వారా పదవ తరగతి, ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసే సదుపాయం (Open SSC/Inter). రాయాల్సిన ప్రధాన పరీక్షలు (Entrance Exams). ఈ కోర్సుల్లో చేరాలంటే విద్యార్థులు ఈ పరీక్షలపై అవగాహన కలిగి ఉండాలి. JEE
Mains/Advance (IIT/NIT కోసం), NEET(వైద్యం), EAPCET/EAMCET (స్టేట్‌ లెవెల్‌), CLAT(లా), NCHMCT(హోటల్‌ మేనేజ్‌మెంట్‌), ICAR(వ్యవసాయం).
ఇంటర్‌ తర్వాత ఉన్న ఈ వందలాది అవకాశాలలో మీ అభిరుచితగినట్టుగా, మీలోనిసామర్థ్యంఅంచనా వేసుకుని ముందడుగు వేయండి. కేవలం అందరూ వెళ్తున్నారని కాకుండా స్వతహాగా మీరే ఎంపిక చేసుకొని నచ్చిన కోర్సును ఇష్టంగా చదివి, అనుకున్న లక్ష్యాన్ని సాధించి బంగారు భవితను నిర్మించుకోవాలని ఆశిస్తున్నాను.

  • డా||మహ్మద్‌ హసన్‌,
    9908059234
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -