Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశీతాకాల విడిది కోసం..

శీతాకాల విడిది కోసం..

- Advertisement -

హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో స్వాగతం పలికిన గవర్నర్‌, డిప్యూటీసీఎం, మంత్రులు
22 వరకు రాష్ట్రపతి నిలయంలో బస


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ప్రథమ పౌరులిరాలికి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. ఈ నెల 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో హకీంపేట, బొల్లారం, అల్వాల్‌, తిరుమలగిరి, కార్ఖానా, తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. 19న ఉదయం 11 గంటలకు ఆలిండియా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్ల జాతీయ సదస్సును ఆమె ప్రారంభించనున్నారు.

20,21 తేదీల్లో ఉపరాష్ట్రపతి పర్యటన
భారత ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్‌ ఈ నెల 20,21 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. 20న రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మెన్ల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొంటారు. ఆ రోజు రాత్రి లోక్‌భవన్‌లో బస చేస్తారు. 21న ఉదయం కన్హ శాంతివనంలో నిర్వహించే ప్రపంచ ద్యాన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచే నేరుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని న్యూఢిల్లీ తిరిగి వెళ్తారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌ రామకృష్ణారావు టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో ఏవిధమైన లోటు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -