Saturday, March 28, 2026
E-PAPER
Homeసినిమామరో సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ కోసం..

మరో సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ కోసం..

- Advertisement -

వెంకటేష్‌, నందమూరి కళ్యాణ్‌ రామ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి కొలాబరేషన్‌లో విజయవంతమైన నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ ఇటీవల ఒక భారీ సినిమాటిక్‌ కొలాబరేషన్‌ను ప్రకటించింది. భారీ వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ఘనంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ఈ బ్యానర్‌ ఇప్పటికే ‘భగవంత్‌ కేసరి’ రీజినల్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ వంటి వరుస విజయాలను అందించింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, జీ స్టూడియో సహ-నిర్మాతగా చేరింది.

‘ఎఫ్‌2, ఎఫ్‌3, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఎంటర్‌టైనర్‌ల తర్వాత వెంకటేష్‌తో కలిసి ఇది అనిల్‌ రావిపూడి చేస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం. అలాగే సంచలనాత్మక బ్లాక్‌బస్టర్‌ ‘పటాస్‌’ తర్వాత కళ్యాణ్‌ రామ్‌తో ఇది అనిల్‌ రావిపూడి రెండవ చిత్రం. ఈ కొత్త చిత్రం, దర్శకుడు అనిల్‌ రావిపూడితో షైన్‌ స్క్రీన్స్‌ సంస్థకు మూడో కొలాబరేషన్‌ నిలుస్తూ, వీరి విజయవంతమైన అనుబంధం మరింత బలపడింది. విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్‌ అడ్రెస్‌ అయిన దర్శకుడు అనిల్‌ రావిపూడి మరోసారి క్లీన్‌గా, అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో కొత్త ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. హాస్యం, భావోద్వేగాలు, పండగ వాతావరణం అన్నీ కలిసి ఈ సినిమాను ఒక పర్ఫెక్ట్‌ సంక్రాంతి ట్రీట్‌గా తీర్చిదిద్దుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -