Wednesday, April 8, 2026
E-PAPER
Homeమానవివేసవిలో పిల్లల కోసం..

వేసవిలో పిల్లల కోసం..

- Advertisement -

ఎండలు ఊపందుకున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. దద్దర్లు, దురద వంటి సమస్యలు చిన్న పిల్లల సున్నిత చర్మంపై ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. వేసవిలో వారిని జాగ్రత్తగా చూసుకోకపోతే దద్దుర్లు, మొటిమలు వస్తాయి. అందుకే వేసవిలో పిల్లల చర్మం పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో పిల్లలకు ప్రతిరోజూ స్నానం చేయించాలి. దీంతో వారు ఉత్సాహంగా ఉంటారు. వారికి రిఫ్రెష్‌ కలుగుతుంది. అంతేకాకుండా.. చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్‌ సమస్య ఉండదు. పిల్లలకు మరీ వేడిగానీ, చల్లగా కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి.

ప్రతిరోజూ షాంపూ లేదా సబ్బు అవసరం ఉండదు. సాధారణ నీటితో స్నానం చేయించడం వల్ల శిశువు చర్మం పై ఉండే చెమట, ధూళి తొలగిపోతాయి. పొడి చర్మం ఉండే పిల్లలకు ఎక్కువగా రుద్దడం చేయకూడదు. సున్నితంగా రుద్దాలి. స్నానం చేయించగానే.. పిల్లలకు బేబీ క్రీమ్‌, లోషన్‌ అప్లై చేయాలి. అలాగే పిల్లలకు బిగుతుగా ఉండే దుస్తులు వేయకూడదు. శిశువు చర్మం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా ఉండాలి. బిగుతుగా ఉండే దుస్తులు వేయడం వలన పిల్లల చర్మం కందిపోవడం.. ఎర్రగా మారడం జరుగుతుంది. వారికి వేసవిలో కాటన్‌ దుస్తులు మాత్రమే వేయాలి.

పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. త్వరగా పొడిబారుతుంది. మాయిశ్చరైజ్‌ సరిగా లేకపోతే చర్మంలోని తేమ పోతుంది. ఈ సమయంలో మాయిశ్చరైజర్‌ చేయాలి. వడదెబ్బ నుండి రక్షిస్తుంది. బయటకు వెళ్లినప్పుడు పిల్లలకు పూర్తిగా దుస్తులు వేయాలి. టోపీ పెట్టుకోవడమే కాకుండా.. ఒక గొడుగు కూడా తీసుకెళ్లాలి. వేడి దద్దుర్లు నుండి దూరంగా ఉండటానికి ఇ బేబీ సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో పిల్లలను బయటకు తీసుకురావద్దు. ఎందుకంటే ఈ సమయంలో బయటకు తీసుకురావడం వలన హీట్‌ స్ట్రోక్‌, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -