కార్మికులకు ‘ఉరి’గా లేబర్ కోడ్‌లు
మోడీ ప్రభుత్వ చర్య అప్రజాస్వామికం
వీధి పోరాటాలకు సన్నద్ధం కావాల్సిందే..
లేబర్‌కోడ్‌ల ప్రతులు దహనం : సీఐటీయూ నిరసన ర్యాలీలో ఎం.సాయిబాబు, చుక్క రాములు
పాల్గొన్న ఎస్ వీరయ్య, పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందనీ, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు డిమాండ్ చేశారు. దేశంలో 50కోట్ల కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, వారికున్న హక్కులను హరించేందుకు మోడీ ప్రభుత్వం ఆ కోడ్‌లను తీసు కొచ్చిందని విమర్శించారు. నాలుగు లేబర్‌కోడ్‌ల నోటిఫి కేషన్‌కు నిరసనగా శనివారం హైదరాబాద్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ‘8గంటల పనిదినం స్థానంలో 12గంటల పని వద్దు’, ‘కార్మికులను బానిసత్వంలోకి నెట్టే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి’, ‘కార్మిక చట్టాలను తుంగలో తొక్కి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల అమలు ఆపాలి’, ‘కార్మిక వ్యతిరేక మోడీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. నాలుగు లేబర్ కోడ్‌ల ప్రతులను దహనం చేశారు.
అనంతరం సాయిబాబు మాట్లాడుతూ మోడీ ప్రభు త్వం చట్ట విరుద్ధంగా, అప్రజాస్వామికంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టా లను రద్దుచేసి వాటి స్థానం లో కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో మంద బలం చూసుకుని తమ ఇష్టం వచ్చినట్టు చట్టాలను తీసుకొచ్చి కార్మికుల హక్కులను హరిం చాలని చూస్తే కార్మిక వర్గం ఊరుకోబోదని హెచ్చరించారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశంలోని అన్ని కార్మిక సం ఘాలు పోరాటాలు చేస్తున్నా.. మోడీ ప్రభుత్వం కార్మికుల వాణిని ఖాతరు చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రజా స్వామ్యంలో కార్మికుల అభిప్రాయా లకు విలువ ఇవ్వకుండా వ్యవహరించడం తగదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేసేందుకు పూనుకోవటం శోచనీయ మని విమర్శించారు.
నవంబర్ 13న అన్ని కార్మిక సంఘాలు కార్మిక శాఖ మంత్రిని కలిసి ముక్త కంఠంతో నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించా లని రాత పూర్వకంగా కోరాయని గుర్తు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర కూడా ఇదే విషయాన్ని చెప్పాయని తెలిపారు. అయినా ప్రభుత్వం మొండి గా వ్యవ హరిస్తున్నదని విమర్శించారు. యాజమాన్యాలకు, కార్పొ రేట్లకు గులాంగిరి చేసేందుకు పూనుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాత్యంత్రానికి ముం దు, ఆ తర్వాత కార్మి కులు పొందుతున్న హక్కులపై మోడీ ప్రభుత్వం గొడ్డలి వేటు వేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల అభిప్రా యానికి విలువ ఇవ్వకపోతే.. పోరాటం క్షేత్రస్థాయిలో ఉధృత పోరాటం నిర్వహించక తప్పదని స్పష్టం చేశారు. ఎక్కడైనా యాజమాన్యం కార్మికు లను తొలగించినా, పరిశ్రమలను మూతేసినా, అప్రజాస్వామికంగా వ్యవహరించినా ఖబడ్డార్ మోడీ.. కార్మికులు చేతు లు ముడుచుకుని కూర్చో రని హెచ్చరించారు.
పిడికిళ్లు బిగించి పోరాట రంగంలో దూకుతారని తెలిపారు. కార్మిక వర్గానికి మద్దతుగా రైతు, వ్యవసాయ కూలీ సంఘాలు ఈ నెల 26న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చా యని గుర్తు చేశారు.ఈ నిరసన కార్యక్రమం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లక్షల కేంద్రాలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలన్నారు. దేశానికి సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గం కావాలా? శ్రమజీవుల కష్టాన్ని దోచుకుంటున్న కార్పొరేట్లు కావాలో తేల్చుకోవాలని హెచ్చరించారు. పార్లమెంట్, శాసన సభల్లో ఉన్న బలాలు శాశ్వతం కావనీ, ఈ దేశంలో కార్మిక వర్గమే శాశ్వతమని గుర్తు చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లు వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షలు చుక్క రాములు మాట్లాడుతూ పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వేతనాల కోడ్, వృత్తిపరమైన భద్రతా, ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్……ఇవన్నీ 29 కార్మిక చట్టాల స్థానంలో కార్మికుల ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నా మని ప్రభుత్వం నమ్మబలుకుతోందని చెప్పారు. కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ కోడ్‌ల విషయంలో కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు వెల్లడించకుండా కప్పి పెడుతున్నాయనీ, మోడీని కీర్తిస్తున్నాయని తెలిపారు. నాలుగు లేబర్ కోడ్‌లు అమలు కావట మంటే కార్మికుల ఉద్యోగ భద్రత గాలికెగిరిపోటమేనని చెప్పారు. భవిష్యత్‌లో పర్మినెంట్ ఉద్యోగాలుండబోవని ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏ సంస్థ మూతపడతదో ఎవరమూ చెప్పలేమన్నారు. ఇప్పు డున్న పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం వంద మంది కంటే ఎక్కువ మంది కార్మికులున్న సంస్థలను ప్రభుత్వ అనుమతితో మూసివేయడం గానీ, కార్మికులను తీసివే యడం గానీ చేయాలని పేర్కొన్నారు.
కానీ.. కొత్తగొ చ్చిన ఇండిస్టీయల్ రిలేషన్ కోడ్ ప్రకారం వంద మంది కార్మికుల సంఖ్యను మూడు వందలకు చేశారని తెలిపారు. అంటే మూడు వందలకు తక్కువగా కార్మికులున్న సంస్థలను ఎప్పుడైనా యాజమాని మూసి వేసేందుకు అవకాశం ఉంద నీ, ఎప్పుడైనా కార్మికులను తొలగించేందుకు అవకాశం కల్పించిందని వివరించారు. ఇది హైర్ అండ్ ఫైర్ విధానం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. శాశ్వత ఉద్యోగం లేకుండా చర్యలు తీసుకునేందుకు ఈ చట్టాలు అవకాశాలు కల్పిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవాలని రేవంత్ సర్కార్‌కు సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని కోరారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మరని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, చంద్రశేఖర్, ఎం వెంకటేశ్, వీరారెడ్డి, కళ్యాణం వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, ఎస్వీ రమ, పద్మశ్రీ, పి.జయలక్ష్మి, వీఎస్‌రావు, ఒంగూరి రాములు, కూరపాటి రమేష్, ముత్యంరావు, పి శ్రీకాంత్, కె కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.



