నేటికాలంలో చాలామంది కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు. రోజులో ఎక్కువ గంటలు కంప్యూటర్, మొబైల్ ఫోన్ల స్క్రీన్లు చూస్తుంటే కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికారణంగా చిన్నవయసులోనే కళ్లజోడులు పెట్టుకుంటున్నారు. మరి కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందామా..!
సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. సీజన్లలో దొరికే బత్తాయి, నారింజ పండ్లలో కంటికి ఉపయోగపడే పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు కంటిచూపును మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు.
క్యారెట్
ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది. చేపలలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. రోజూ మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. బచ్చలికూర ఎక్కువగా తీసుకుంటే మంచిది. బచ్చలికూర కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చికెన్, గ్రుడ్లు, నానబెట్టిన బాదంపప్పులు రోజుకు రెండు లేదా మూడు తింటే కంటి సమస్యలు దరిచేరవు అని వైద్యులు సలహా ఇస్తున్నారు.
కంటి ఆరోగ్యం కోసం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



