- Advertisement -
యుద్ధాన్ని
పచ్చిగా సమర్థించేవారిని
చూస్తున్న వేళ
నా జాతి మానవత్వాన్ని
నాకు నేనుగా
ప్రశ్నించుకుంటున్నా..
కార్చిచ్చు
అభివృద్ధి కారణాన
ఆదివాసులను
అడవులనుండి
తన్ని తరిమేస్తున్న వేళ
నా హక్కుల అస్తిత్వంకై
మొండిగా పోరాడుతున్నా
ఊసరవెళ్లి
కృత్రిమమేధ నకళ్లు
ఊపిరాడకుండా ఊబిలో
కూరుకుపోతున్నవేళ
నా విజ్ఞాన వివేకం
జారిపోకుండా
అడుగడుగున
జాగ్రత్తపడుతున్నా
కళావిద్య
ప్రజలనుండి ప్రజలకు
చరిత్రగతి తెలిసిన వేళ
అనుభవసహిత జ్ఞానంగా
పల్లవించే శాస్త్రీయ బోధనకై
అనునిత్యం శోధిస్తున్నా
- కె.శాంతారావు
9959745723
- Advertisement -



