Friday, May 23, 2025
Homeసినిమా'పెద్ది' కోసం..

‘పెద్ది’ కోసం..

- Advertisement -

రామ్‌ చరణ్‌ నటిస్తున్న పాన్‌-ఇండియా ప్రాజెక్ట్‌ ‘పెద్ది’. దీనికి బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్‌ షాట్‌ గ్లింప్స్‌తో దేశ వ్యాప్తంగా హ్యుజ్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. పవర్‌ఫుల్‌ కొలాబరేషన్‌, అద్భుతమైన టీంతో ‘పెద్ది’ భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది.
పాన్‌-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వద్ధి సినిమాస్‌ బ్యానర్‌ పై వెంకట సతీష్‌ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రమిది.
ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో మాసీవ్‌ విలేజ్‌ సెట్‌ని రూపొందించారు. ఈ సినిమాలోని రా అండ్‌ రస్టిక్‌ బ్యాక్‌డ్రాప్‌, మూలకథను ప్రతిబింబించేలా, ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో టీమ్‌ అద్భుతమైన వర్క్‌ చేస్తోంది. ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా నేతత్వంలో మ్యాసీవ్‌ విలేజ్‌ సెట్‌ని నిర్మించారు. ఇక్కడ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌, టాకీ పోర్షన్‌ని చిత్రీకరించనున్నారు. ఇప్పటికే 30% షూటింగ్‌ పూర్తి కాగా, ప్రస్తుతం ప్రారంభమైన ఈ షెడ్యూల్‌ ద్వారా సినిమా ఓ కీలక దశను చేరుకోనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రామ్‌ చరణ్‌ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో జాన్వీ కపూర్‌ కథానాయిక.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -