– నెట్‌వర్క్ ఇష్యూతో ప్రయివేటు టెలికాం కంపెనీకి
– మారిన ప్రభుత్వ విద్యుత్‌సంస్థ
– విద్యుత్ ఉద్యోగులకు కొత్త ఫోన్ నెంబర్లు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయప్రతినిధి
బీఎస్‌ఎన్‌ఎల్.. ప్రభుత్వ టెలికాం సంస్థ. ‘కనెక్టింగ్ ఇండియా’ అంటూ మారుమూల ప్రాంతాల్లో సైతం టెలీ, ఇంటర్నెట్ సేవలు అందిస్తూ తనదైన ముద్ర వేసుకుంటూ వచ్చింది. కాగా ప్రయివేటు టెలికాం కంపెనీలను అందలం ఎక్కిస్తూ వచ్చిన పాలకుల తీరుతో బీఎస్‌ఎన్‌ఎల్ క్రమంగా తన ప్రభావం కోల్పోతున్న విషయం తెలిసిందే. గతంలో ప్రయివేటు వినియోగదారులు క్రమంగా దూరమవుతూ వస్తుండగా.. తాజాగా ప్రభుత్వ సంస్థలు సైతం బీఎస్‌ఎన్‌ఎల్‌కు దూరమవుతున్నాయి. టీజీఎన్‌పీడీసీఎల్ సంస్థ.. తమ ఉద్యోగులకు, కార్యాలయాలకు బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డులు కేటాయించింది. సిగల్ సమస్య వల్ల పనులు చేయలేకపోతున్నామని, సమాచారం అందించలేకపోతు న్నామని పై నుంచి కిందిస్థాయి ఉద్యోగులు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దాంతో కొత్తగా ఎయిర్‌టెల్ సిమ్‌లను తమ సంస్థ కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సిగల్ కలవకపోవడంతో విద్యుత్ అధికారులకు, సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కమ్యూనికేషన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక్కట్లు పడినట్టు సమాచారం. దాంతో ఎయిర్‌టెల్‌కు తమ ఫోన్ నెంబర్లను మార్చారు. టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాల్లో అధికారుల ఫోన్ నెంబర్లు మారాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా స్థాయి ఎస్‌ఈ నుంచి ఏడీఈ, ఏఈ తదితరుల అధికారులకు, కార్యాలయాలకు కొత్తగా ఎయిర్‌టెల్ సిమ్‌కార్డులు కేటాయించారు. మొత్తంగా 623 మంది అధికారుల, కార్యాలయాల ఫోన్ నెంబర్లు మారాయి.
ఫోన్ సిగల్‌లో సమస్యలు :జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.రవీందర్
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉపయోగించే అన్ని అధికారిక మొబైల్ నెంబర్లు మారా యి. ప్రస్తుతం వినియోగిస్తున్న నెట్‌వర్క్ వల్ల సిగల్ సమస్యలు వస్తుండటంతో కొత్తగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ లోకి మారాయి. దాంతో జిల్లాలో పనిచేస్తున్న విద్యుత్‌శా ఖల అధికారులవి, జిల్లా కంట్రోల్ రూమ్ ఆఫీస్‌లో వినియోగించే అన్ని మొబైల్ నెంబర్లు మారాయి.
సిగల్ కోసం.. బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఎయిర్‌టెల్‌కు..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES