నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనలో భాగంగానే ఈ బదిలీలు చేశామని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సయ్యద్ అలీ ముర్తుజాకు జీఏడీ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎం రఘునందన్ రావు వాణిజ్య పన్నుల కమిషనర్‌గా బదిలీ అయ్యారు. రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న కే సురేంద్ర మోహన్‌ను వ్యవసాయ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా ఎం హరిత, అక్కడ పని చేస్తున్న సందీప్ కుమార్ ఝాను టీఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శిగా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కే హరితను ప్రభుత్వం నియమించింది.
ఆరుగురు ఐఏఎస్‌లకూ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES