చర్మం అందంగా కాంతివంతంగా తయారవ్వాలంటే మనం రోజుకు 5 లీటర్ల నీటిని తాగాలి. కాలంతో సంబంధం లేకుండా రోజూ తప్పకుండా నీటిని తాగాలి.. ఇలా నీళ్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చర్మం పొడి బారకుండా ఉంటుంది.. ఇక చర్మ సౌందర్యం కోసం కొన్ని రకాల జ్యూస్ లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యూస్‌కు కావలసిన పదార్థాలు :
2 క్యారెట్స్, 2 టమాటాలు, ఒక కీరదోస, బీట్ రూట్
తయారీ ఇలా :
వీటిని తీసుకొని కడిగి ముక్కలుగా చేసి జార్‌లో వేసి జ్యూస్ లా చేసుకోవాలి. వడకట్టగా వచ్చిన జ్యూస్ లో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి. ఈ జ్యూస్ ను తాగిన అరగంట తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే సాయంత్రం 5 గంటల సమయంలో బత్తాయి, ఫైనాఫిల్, కమలా పండ్లతో చేసిన ఏదో ఒక జ్యూస్‌ను తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల చర్మం రంగు మారుతుంది. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా ముఖం అందంగా కనబడాలనుకునే వారు రాత్రి భోజనంలో కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఈ పండ్లను కూడా సాయంత్రం 7 లోపు తీసుకోవాలి..
ఇలా క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. చర్మకణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మలినాలు, మత కణాలు చర్మం పై పేరుకుపోకుండా తొలగిపోతాయి. కాలుష్యం, ఎండలో తిరగడం వల్ల రంగు మారిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఐరన్ ఉన్న పండ్లను తీసుకోవడం వల్ల చర్మ రంగు పెరగడంతో పాటు.. జుట్టు కూడా బాగా పెరుగుతుంది.
చర్మ సౌందర్యం కోసం…
- Advertisement -
- Advertisement -