శర్వా హీరోగా తన 36వ చిత్రం ‘బైకర్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. స్పోర్ట్స్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. దీపావళి సందర్భంగా విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రొఫెషనల్ మోటార్‌సైకిల్ రేసర్ పాత్రలో కనిపించబోతున్న శర్వా తన పాత్ర కోసం ఊహించని రీతిలో ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. తాజాగా విడుదలైన స్టిల్స్‌లో ఆయన ఫిజిక్, కాన్ఫిడెన్స్ అంతా కలిపి కొత్త శర్వాని ప్రజెంట్ చేశాయి. అంతేకాదు రేసర్ స్పిరిట్‌ను అద్భుతంగా చూపించారు. శర్వా తన పాత్రకు సరిపడేలా లీన్ అండ్ అథ్లెటిక్ బాడీని తీర్చిదిద్దుకున్నారు.
నెలల తరబడి వర్కౌట్స్, డైట్, డెడికేషన్‌తో ట్రాన్స్‌ఫర్మేషన్ సాధించారు. ఇంత ఫిట్‌గా, ఎనర్జీగా శర్వా కనిపించడం అభిమానులకు పండుగలా మారింది. శర్వా కొత్త లుక్, కథ కాన్సెప్ట్, టాప్ టెక్నికల్ టీమ్ ఇవన్నీ కలసి ‘బైకర్’ సినిమాను ఒక థ్రిల్లింగ్ ఎమోషనల్ రైడ్‌గా మార్చబోతున్నాయి. అభిమానులు ఇప్పుడు శర్వా కొత్త అవతార్‌ని థియేటర్స్‌లో చూడటానికి ఎదురుచూస్తున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్, మ్యూజిక్: జిబ్రాన్, ఎడిటర్ : అనిల్ కుమార్ పి, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ : ఎ పన్నీర్ సెల్వం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్ సందీప్.
‘బైకర్’ కోసం..
- Advertisement -
- Advertisement -



