Monday, May 5, 2025
Homeఆటలుఏడేండ్లలో తొలిసారి!

ఏడేండ్లలో తొలిసారి!

- Advertisement -

– భారత్‌పై శ్రీలంక మహిళల గెలుపు
కొలంబో (శ్రీలంక) : మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక అద్భుతం చేసింది. ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై 3 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో భారత్‌పై శ్రీలంకకు ఇది ఏడేండ్లలో తొలి విజయం కావటం గమనార్హం. వన్డేల్లో ఇరు జట్లు 34 సార్లు తలపడగా.. ఓవరాల్‌గా భారత్‌పై శ్రీలంకకు ఇది మూడో విజయం. 276 పరుగుల భారీ ఛేదనలో నీలాక్షిక సిల్వ (56, 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్థ సెంచరీకి తోడు హర్షిత సమరవిక్రమ (53, 61 బంతుల్లో 5 ఫోర్లు), అనుష్క సంజీవని (23 నాటౌట్‌), విష్మి (33), కవిష దిల్హరి (35) రాణించటంతో 49.1 ఓవర్లలోనే శ్రీలంక 278/7 పరుగులు చేసింది. 3 వికెట్ల తేడాతో మెరుపు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత మహిళలు 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేశారు. రిచా ఘోష్‌ (58, 48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), జెమీమా రొడ్రిగస్‌ (37, 46 బంతుల్లో 3 ఫోర్లు), ప్రతిక రావల్‌ (35, 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (30, 45 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించిన భారత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. శ్రీలంక మూడింట రెండు విజయాలు సాధించగా, దక్షిణాఫ్రికా రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -