నవతెలంగాణ – కంఠేశ్వర్
మినిస్ట్రీ అఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇంటిగ్రేటెడ్ రోడ్ ఆక్సిడెంట్ డేటాబేస్ (ఐ ఆర్ ఏ డి) గత నాలుగు సంవత్సరాలుగా పోలీస్ , రవాణా , రహదారుల విభాగాలకు ప్రమాదాలకు కారణాలని , వాటి మీద విశ్లేషణ ని అందిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ లో మొదటి సారి ప్రైవేట్ హాస్పిటల్స్ ని నిజామాబాదు జిల్లాలో ఐ ఆర్ ఏ డి అప్లికేషన్ లో ఈరోజు నమోదు చేయడం జరిగినది . దీని ద్వారా వివిధ విభాగాల వారు రోడ్డు ప్రమాదానికి సంబందించిన మెడికో లీగల్ సర్టిఫికెట్ , డిశ్చార్జ్ సమ్మరీ , పోస్టుమార్టుమ్ రిపోర్ట్స్ లు ఐఆర్ఎడి అప్లికేషన్ ద్వారా పొందవచ్చును. తెలంగాణ లో మొదటిసారి నిజామాబాదు జిల్లా నుండి ప్రతిభ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ , సాయి శుభ హాస్పిటల్ , అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ వారు నమోదు చేసుకున్నారు. మిగితా వాటిని కూడా తొందరలో నమోదు చేయిస్తామని జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి (డి ఐ ఓ) మధు తెలిపారు. ఇట్టి అప్లికేషన్ ని ఉపయోగించుకుని ప్రమాదాల్ని విశ్లేషిస్తున్నామని నిజామాబాదు జిల్లా ని ప్రమాద రహిత జిల్లాగా చేయడమే వారి లక్ష్యం అని తెలిపారు.
తెలంగాణలో మొదటిసారి ప్రయివేట్ హాస్పిటల్లో నిజాంబాద్లో ఐఆర్ఏడి అప్లికేషన్ నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES