– రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్
– బస్సులపై జీఐ వారసత్వ ప్రదర్శనకు టీజీఎస్‌ఆర్టీసీ శ్రీకారం
నవతెలంగాణ – ధూల్ పేట్
దేశంలో తొలిసారిగా ఆర్టీసీ బస్సులతో ”జీఐ ఆన్ వీల్స్”ను ప్రదర్శిస్తున్నట్టు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జీఐ హస్తకళలతో అలంకరించిన ప్రత్యేక బస్సులతో హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో శుక్రవారం నిర్వహించిన జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమంలో టీజీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మెన్ అండ్ ఎండీ నాగి రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరితో కలిసి గవర్నర్, మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. జీఐ గుర్తింపు పొందిన కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందిం చడం, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసుకోవడం అవసరమని తెలిపారు. సంస్కృతి సమాజానికి ఆత్మస్వరూపమని, సాంస్కృతిక అవగాహన లేకుం డా సమాజం అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఈ తరహా కార్యక్రమాలు యువతలో సంప్రదాయ కళలపై ఆసక్తిని పెంచుతాయని, కళాకారులకు గౌరవాన్ని కల్పిస్తాయని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం గవర్నర్ దూరదృష్టి ఫలితమని తెలిపారు. జీఐ ఉత్పత్తుల ప్రాచుర్యం, మార్కెటింగ్ విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఈ చర్యలతో గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు. టీజీఎస్ ఆర్టీసీతో ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో అమలు చేయడానికి పూర్తి సహకారం అందిస్తా మని హామీ ఇచ్చారు. అదేవిధంగా పోచంపల్లి ఇక్కత్ వరంగల్, వరంగల్ తివాచీలు (కార్పెట్లు), కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నారాయణపేట్ చీరలు, చెరియల్ స్క్రోల్ పెయింటింగ్స్, నిర్మల్ పెయిం టింగ్స్ వంటి తెలంగాణకు చెందిన ఆరు ప్రముఖ జీఐ హస్తకళలను బస్సులపై ప్రత్యేకంగా ప్రతిష్టిం చారు. ఈ కళారూపాలు తెలంగాణ కళాకారుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తూ, ప్రజా రవాణాతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం పొందనున్నాయ న్నారు. ప్రజారవాణా వ్యవస్థను సృజనాత్మక వేదికగా మలచి, తెలంగాణ సాంస్కృతిక వారసత్వా న్ని ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. టీజీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మెన్ అండ్ ఎండీ మాట్లాడుతూ.. బస్సులపై జీఐ కళా రూపాలను ప్రదర్శించడంతో సంస్కృతిని ప్రజలకు చేరువ చేయడంతో పాటు కళాకారులకు ప్రోత్సా హం అందించడమే లక్ష్యమని చెప్పారు. ఈ బస్సు లపై ప్రదర్శించిన డిజైన్లను జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ ఏఎఫ్‌ఏయూ) విద్యార్థులు రూపొందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నగదు బహుమతులు, మెమొంటోలు అందజేశారు. జీఐ గుర్తింపుల సాధనలో సేవలందించిన సుభజిత్ సహాను ప్రత్యే కంగా సన్మానించారు. ఆరు జీఐ కళారూపాలకు చెందిన కళాకారులను సహితం ఘనంగా సత్కరిం చారు. కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికా రులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రాజశేఖర్, ఖుస్రో షా ఖాన్, రీజినల్ మేనేజర్లు శ్రీలత, సుధ పరిమళ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ప్రతినిధులు, కళాకారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జీఐ అంటే..?
భౌగోళిక సూచిక (జీఐ) అనేది ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తి లక్షణాలు, నైపుణ్యం, సంప్రదా యాన్ని ప్రతిబింబించే సమిష్టి మేధో సంపత్తి హక్కు. ప్రస్తుతం తెలంగాణకు 18 జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులు ఉన్నాయి. జీఐ గుర్తింపుతో సంప్రదాయ కళలు, వారసత్వాన్ని సంరక్షించడం, నకిలీలను నివారించడం, కళాకారులకు గుర్తింపు కల్పించడం, వారి జీవనోపాధిని స్థిరంగా నిలుపుటకు దోహదపడుతుంది.
దేశంలో తొలిసారిగా ‘జీఐ ఆన్ వీల్స్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



