Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెండు గ్రామ పంచాయతీలకు

రెండు గ్రామ పంచాయతీలకు

- Advertisement -

జాతీయ అవార్డులు
అభినందించిన మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబర్చిన రాష్ట్రానికి చెందిన రెండు గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు దక్కాయి. వికారాబాద్‌ జిల్లా కోటేపల్లి మండలం మోతుకుపల్లి, సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి పంచాయతీలకు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. గ్రామ స్థాయిలో పారదర్శక పరిపాలన, ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో చూపిన ప్రతిభకు మోతుకుపల్లికి ”గుడ్‌ గవర్నెన్స్‌” గుర్తింపు లభించింది. మహిళా సాధికారత, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమల్లో చూపిన కృషికి గాను ఫసల్వాడి గ్రామానికి ”విమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ” అవార్డు దక్కింది. తెలంగాణకు రెండు విభాగాల్లో అవార్డులు రావడం పట్ల పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడం గర్వకారణమన్నారు. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన, మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. అవార్డులందుకున్న పంచాయతీలకు అమె అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -