Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కిషన్రావుపల్లి రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ లైన్ క్లియర్.!

కిషన్రావుపల్లి రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ లైన్ క్లియర్.!

- Advertisement -

ప్రత్యేక జీవో 101 విడుదల చేసిన ప్రభుత్వం
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన తాడిచర్ల-భూపా లపల్లి రహదారి నిర్మాణానికి అటవీశాఖ నుంచి ఫేజ్-2 అనుమతులతోపాటు ప్రభుత్వం ప్రత్యేక జీవో 101ని విడుదల చేసింది. దీంతో కిషన్రావుపల్లి నుంచి అటవీ మార్గం గుండా భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు అటవీశాఖ అనుమతులు రావడంతో రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. దీంతో తాడిచెర్ల, పెద్దతూండ్ల, చిన్నతూoడ్ల, మల్లారం, కిషన్ రావుపల్లి, గాదంపల్లి, దుబ్బపేట గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కాటారం మీదుగా భూపాలపల్లి..మండల కేంద్రం తాడిచర్ల నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం కాటారం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. తమ ప్రాంతం నుంచి పెద్దతూండ్ల మీదుగా అటవీ ప్రాంతం గుండా రహదారి నిర్మిస్తే ఎంతో సమయంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లే వారు కూడా ఎంతో వ్యయప్ర యాసలకు ఓర్చుకోవాల్సి వస్తుంది.

ఏడాది క్రితం తాడిచర్ల-ఖమ్మంపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై వంతెన అందుబాటులోకి రావడంతో దూర భారం తగ్గింది. 2017 సంవత్సరంలో ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి అనుమతి వచ్చింది. ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మా ణాన్ని పూర్తిచేశారు. మిగతా రోడ్డు నిర్మాణం కోసం అటవీ అనుమతులు రాకపోవడంతో అక్కడికే నిర్మాణాన్ని నిలిపివేశారు.రూ.4.67 కోట్ల చెల్లింపుతో రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు ఒక వరస రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. మండలం పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్రావుపల్లి నుంచి అటవీప్రాంతం గుండా భూపాలపల్లి వన్ ఇంక్లైన్ మైన్ వరకు ఏడు మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టవ చచని.. ఆ ప్రాంతంలో తాము నష్టపోతున్న చెట్ల సంపదకు గాను రూ.4.67 కోట్ల పరిహారాన్ని చెల్లిం చాలని అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం నిధులు చెల్లించడంతో ఫారెస్ట్ నుంచి ఫేజ్-2 అనుమతులతోపాటు ప్రభుత్వం ,ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఫారెస్ట్ అధికారులు త్వరలోనే చెట్లను తొలగించనున్నారు. కిషన్రావుపల్లి నుంచి భూపాలపల్లి సమీపంలోనే వన్ఇంక్లైన్ వరకు 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మా ణానికి అధికారులు రూ.15 కోట్లతో టెండర్లు పిలిచారు. ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లాలంటే కాటారం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయా ల్సి ఉంటుంది. ఖమ్మంపల్లి- తాడిచర్ల మీదుగా కేవ లం 30 కిలోమీటర్లలోనే భూపాలపల్లికి చేరు కోవచ్చు. ప్రస్తుతం నిత్యం వందలాది వాహనాలు మంథని మీదుగా సుదూర ప్రాంతం నుంచి వెళ్తు న్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే సగం దూర భారం తగ్గనుండటంతో విద్య, వైద్యం మరిం త మెరుగు పడనుంది. సమయంతో పాటు ఇంధన ఖర్చులు భారీగా ఆదా కానున్నాయి.

మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు: మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు

ఎన్నో ఏళ్లుగా మండల ప్రజలు ఎదురు చూస్తున్న కిషన్రావుపల్లి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఎట్టకేలకు పేజ్-2 అనుమతులతోపాటు ప్రత్యేక జీవో 101ను తీసుకరావడంతో అటవీశాఖ మార్గం నుంచి రోడ్డు నిర్మాణానికి ఫుల్ అనుమతులు వచ్చాయి. ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు ఈ ప్రాంత ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -